ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చాలా సినిమాలు గుర్తొచ్చేవి.. కానిప్పుడు తెలుగు సినిమా అంటే ముందుగా బాహుబలి గుర్తొస్తుంది.. తెలుగు సినిమాని బాహుబలికి ముందు బాహుబలికి తరువాత అని చెప్పుకుంటున్నామంటే.. రాజమౌళి బాహుబలితో ఎంతలా మాయ చేసారో అర్థం చేస్కోవచ్చు.. అందుకే రాజమౌళి తర్వాతి సినిమా కోసం సగటు సినీ ప్రేక్షకుడు కూడా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు.. దానికి తగ్గట్టే రాజమౌళి కూడా ఎవరి ఊహలకి అందకుండా తారక్,చరణ్ ల కలయికలో సినిమా అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసాడు.. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఇప్పుడొక న్యూస్ చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే రాజమౌళి సినిమాలో తారక్ గ్యాంగ్-స్టర్ గా, చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారట.. ఇదే నిజమైతే ఫాన్స్ కి పూనకాలే…Read more…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here